ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
అర్హులందరికీ పథకాలు అందించాలనే ఉద్దేశంతో సిఎం జగన్ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని రూపొందించారని డిప్యూటీ సిఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. స్థానిక శ్రీబలుసులమ్మ కళ్యాణ మండపంలో మున్సిపల్ కమిషనర్ శామ్యూల్ ఆధ్వర్యంలో 10, 11, 12 వార్డుల్లో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ ఈ కార్య కమాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యల ను, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా అర్హులకు వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ స్పెష ల్ ఆఫీసర్ దాసరి సావిత్రి, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ కర్రి భాస్కరరావు, మున్సిపల్ ఇంజినీర్ బి.మురళీకృష్ణ పాల్గొన్నారు.
కాళ్ల :రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాలను సద్వినియోగం చేసుకోవాలని డిసిసిబి ఛైర్మన్ పివిఎల్.నరసింహరాజు అన్నారు. మండలంలోని దొడ్డనపూడి, కోపల్లె గ్రామాల్లో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో డిసిసిబి ఛైర్మన్ పివిఎల్.నరసింహరాజు మాట్లాడారు. అనంతరం లబ్ధిదారులకు సర్టిఫికెట్లను అందించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు పచ్చిగోళ్ల సోమేశ్వరరావు, ఎంపిపి పి.శిరీష విశ్వనాధరాజు, దొడ్డనపూడి గ్రామ సర్పంచి కొల్లి సుబ్బారావు, కోపల్లె గ్రామ సర్పంచి బూడి నాగమణి, మండల ప్రత్యేక అధికారి కె.కిషోర్‌కుమార్, తహశీల్దార్ టిఎ.కృష్ణారావు, ఎంపి డిఒ జి.స్వాతి, ఎఒ ఎంఎస్.ప్రభాకర్, కోపల్లె ఉప సర్పంచి వెంకట పర్రాలు, వైసిపి గ్రామ అధ్యక్షులు సాయి పాల్గొన్నారు.
పాలకొల్లు రూరల్ : మండలంలోని దిగమర్రు గ్రామంలో శనివారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎంఎల్‌సి కవురు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పలు ధ్రువపత్రాలు అందించారు. అనంతరం వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి రాపాక నగేష్ కరుణా కర్, జెడ్‌పిటిసి సభ్యులు నడపన గోవిందరాజులు నాయుడు, ఉప సర్పంచి కొండేటి మల్లికార్జునరావు, సొసైటీ ఛైర్మన్ రాపాక సునిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమార దత్తాత్రేయ వర్మ, మాజీ ఎంఎల్‌సి శేషుబాబు పాల్గొన్నారు.
భీమవరం రూరల్ : పట్టణంలోని 4, 16, 30 వార్డుల్లో శనివారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నవరత్న పథకాలతో పాటుగా విద్యార్థులకు జగనన్న సురక్ష పథకం ద్వారా కీలకమైన సర్టిఫికెట్లను కూడా అందించే విషయంలో వాలంటీర్లు చాలా కీలకంగా పని చేస్తున్నారన్నారు. కరోనా సమయంలో కూడా ప్రజలకు సేవలందించిన ఘనత వాలంటీర్లకు దక్కిందన్నారు. విద్యార్థులు జగనన్న సురక్ష పథకాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం ద్వారా తమకు కావాల్సిన సర్టిఫికెట్లను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
పట్టణంలోని ఐదో వార్డు పరిధిలో రూ.30 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు ఈ రోడ్డును నిర్మిస్తున్నామని చెప్పారు.










