Aug 22,2023 23:31

అర్హులందరికీ గృహలు మంజూరు చేయండి..!
ప్రజాశక్తి - రామకుప్పం:
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న గృహ నిర్మాణాలను అర్హులందరికీ మంజూరు చేయాలని ఎమ్మెల్సీ భరత్‌ తెలిపారు. మంగళవారం మండల ప్రజాపరిషత్‌ సమావేశ భవనంలో ఎంపీపీ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ మండలంలోని నిరుపేదలకు గహాలు మంజూరు చేసి, స్థలాలు లేని వారికి స్థలాలు కేటాయించాలని అధికారులకు ఆదేశించారు. విజలాపురం పంచాయతీలో పదుల సంఖ్యలో డుప్లికేట్‌ పట్టాలు ఉన్నాయని సర్పంచ్‌ బాబురెడ్డి తెలుపగా... విచారించి ఉన్నతాధికారుల ఆదేశానుసారం చర్యలు తీసుకుంటామని తహశీల్దార్‌ మురళి వివరణ ఇచ్చారు. భూసమస్యలతో ఇబ్బందులను ప్రజలకు పరిష్కార చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను కోరారు. అదేవిధంగా గ్రామాల్లో తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీలు, సిసి రోడ్లు తదితర మౌలిక సదుపాయాలకు సర్పంచులు కషి చేయాలన్నారు. అటవీ సరిహద్దు ప్రాంతాల్లో రైతులు పండిస్తున్న పంటలపై ఏనుగులు చొరబడకుండా నివారణ చర్యలు తీసుకోవాలని అటవీ అధికారులను ఆదేశించారు. అలాగే నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్‌ భవనాలు సకాలంలో పూర్తిచేయాలన్నారు. అభివద్ధి పనులకు అవసరమైన నిధులను మంజూరు చేసేందుకు కషి చేస్తామన్నారు. పాఠశాలల్లో నాడు- నేడు భవనాలను త్వరితకితన పూర్తి చేయాలన్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజనాలను ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం అందించాలన్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి నితిన్‌రెడ్డి, మండల కన్వీనర్‌ బాబు రెడ్డి, కో కన్వీనర్‌ చంద్రారెడ్డి, కో ఆప్షన్‌ నెంబర్‌ బర్కతుల్లా, ఎంపీడీవో రాధాకష్ణ, సర్పంచులు మురళి, రాజగోపాల్‌, భాస్కర్‌ నాయక్‌, మోహన్‌నాయక్‌, ఎంపీటీసీలు పాల్గొన్నారు.