అర్హులందరికీ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం
అందుబాటులోకి ఆధునిక వైద్యసేవలు: ఉపముఖ్యమంత్రి
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్, ఎస్‌ఆర్‌పురం: కుల,మతాలతో సంబంధం లేకుండా అవసరమైన వారికి సకాలంలో వైద్యసహాయం అందిస్తూ అందుకు కావలసిన నిధులను ప్రభుత్వం సమకూర్చడం ఒక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డికె చెల్లుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కే.నారాయణస్వామి అన్నారు. గంగాధర్ నెల్లూరు మండలంలోని ఆత్మకూరు పంచాయతీలో గల రాశిమి రెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాలకష్ణ, సుజాతల కుమార్తె వైష్ణవి ఆరవ తరగతి చదువుతోంది. గత ఫిబ్రవరిలో కాళ్లు వాపురావడంతో పలు ఆసుపత్రులలో చికిత్స కోసం వెళ్లగా లివర్ ప్రాబ్లమ్ అని, వైద్యానికి సుమారు రూ.25లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడం జరిగింది. వారు పలు ఆసుపత్రులను తిరుగుతూ చెన్నైలోని గ్లినీస్ గ్లోబల్ ఆసుపత్రికి వెళ్లారు. వారు మొత్తం అంచనా వేసి రూ.17.5లక్షలు ఖర్చు అవుతుందని దానికి నగదు చెల్లిస్తే సర్జరీ నిర్వహిస్తామని చెప్పారు. దాంతో వారు తమ బిడ్డను ఎలా బతికించుకోవాలని అర్థం కాక గ్రామంలోని పెద్దలకు వారి గోడును విన్నవించుకున్నారు. ఈసమస్యను గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు కె.నారాయణస్వామిని కలసి వారి దృష్టికి తీసుకొచ్చారు. మొదట ఆసుపత్రి వర్గాలు రూ.10లక్షలకు కొటేషన్ ఇవ్వడం జరిగిందని, అనంతరం ఆరు లక్షలు, మరో విడతలో 1.5లక్షలు చెల్లించాలని చెప్పారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి అందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేయమని చెప్పడం ఆదరఖాస్తులు తీసుకెళ్లి ముఖ్యమంత్రికి స్వయంగా చెప్పి మంజూరు చేయించడం జరిగింది. గురువారం ఉపముఖ్యమంత్రి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రాసిమిరెడ్డిపల్లికి కావడంతో అందుకు సంబంధించిన అనుమతి పత్రాలను బాధిత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఇంకా ఎటువంటి సహాయం కావాలన్నా మన ముఖ్యమంత్రి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని బిడ్డ ఆరోగ్యం ప్రధానమనిఉప ముఖ్యమంత్రి అన్నారు. తమ బిడ్డను ఎలా బతికించుకోవాలని దిక్కుతో వచ్చిన పరిస్థితిలో ఉన్న తమకు ముఖ్యమంత్రి జగనన్న దేవుని రూపంలో ఆదుకోవడానికి ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సొమ్ముతో బిడ్డ ఆరోగ్యం బాగుచేయించుకోగలమని నమ్మకం కూడా ఏర్పడిందని అన్నారు.










