ప్రజాశక్తి - ఆచంట
రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, అభివృద్ధి పథకాలకు ప్రాధాన్యతిస్తున్న ప్రభుత్వం వైసిపి అని ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. మంగళవారం మండలంలోని ఆచంట వేమవరం, భీమలాపురం గ్రామాల్లో ఆయా సర్పంచులు జక్కంశెట్టి చంటి, గుబ్బల మాధవరావు, అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ రంగనాథరాజు పాల్గొని మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. వాలంటరీ సచివాలయ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. పేద ప్రజలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్ చిల్లే లావణ్య, కర్నిబత్తుల కార్పొరేషన్ డైరెక్టర్ అందే బసవన్న, సొసైటీ అధ్యక్షులు వీర వీరభద్రం, మొల్లేటి రామకృష్ణ, ఎంపిటిసి ఎ.నాగరాజు పాల్గొన్నారు.
కాళ్ల : ప్రస్తుతం ఉన్న పథకాలు 2024 మే తరువాత కూడా అమలు కావాలంటే మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావాలని, లేకుంటే పథకాలు ఆగిపోతాయని డిసిసిబి ఛైౖర్మన్ పివిఎల్ నరసింహరాజు అన్నారు. మంగళవారం ఏలూరుపాడులో జగనన్న సురక్షలో ఆయన పాల్గొని అర్హులైన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా పివిఎల్ నరసింహరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, అన్ని వర్గాలకూ మేలు చేస్తున్న ప్రభుత్వం వైసిపి అని తెలిపారు. పేదల జీవితాలను మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి భూపతిరాజు జగ్గరాజు, ఎంపిపి పెనుమత్స శిరీష విశ్వనాథరాజు, జెడ్‌పిటిసి పచ్చిగోళ్ల సోమేశ్వరరావు, మండల ప్రత్యేకాధికారి కిషోర్‌కుమార్, తహశీల్దార్ టిఎ.కృష్ణారావు, వైసిపి గ్రామ అధ్యక్షులు దాట్ల శ్రీనివాసరాజు, ఎంపిటిసి చిన్నాపరపు రాంబాబు పాల్గొన్నారు.
పెనుగొండ:మండలంలోని సచివాలయాల పరిధిలో జగనన్న సురక్ష ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన సభలో ఎంఎల్‌ఎ మాట్లాడుతూ అభివృద్ధే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ధ్యేయమన్నారు. కోడిపందేలదిబ్బ, నాగేశ్వరికాలనీలో రోడ్లు వేసిన ఘనత వైసిపిదేనని తెలిపారు. దేవలో రూ.17 కోట్లతో రోడ్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో ఎండిఒ శ్రీనివాస్ దొర, సర్పంచి శ్యామల సోనీ, మేడపాటి చంద్రమోహన్ రెడ్డి, ఎంపిపి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
మొగల్తూరు: ప్రజలకు ప్రభుత్వ సేవలు నేరుగా అందించేందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. మంగళవారం మండలంలోని కాళీపట్నం తూర్పు, రామన్నపాలెం-1 సచివాలయాల వద్ద ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం అర్హులకు ధ్రువ పత్రాలను అందజేశారు. కార్యక్రమాల్లో తహశీల్దార్ అనితకుమారి, ఎంపిడిఒ యు.బాబ్జిరాజు, వైస్ ఎంపిపి కైలా సుబ్బారావు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం : కుంచనపల్లిలో మంగళవారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి జివికె.మల్లికార్జునరావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా కుంచనపల్లిలో 2050 ధ్రువపత్రాలు అందజేశారు. సచివాలయ సేవలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ ఎం.విశ్వనాథ్, సొసైటీ ఛైర్మన్ తాతారావు, కార్యదర్శి ఆర్‌వి.బ్రహ్మం పాల్గొన్నారు.
గణపవరం : గ్రామాల్లో అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే జగనన్న సురక్ష లక్ష్యమని ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు అన్నారు. కేశవరం సచివాలయం వద్ద జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం అర్హులకు ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ పమ్మి లక్ష్మి, ఎంపిపి దండు వెంకట రామరాజు పాల్గొన్నారు.
పెనుమంట్ర : జగన్మోహన్ ఇచ్చే నవరత్నాలు పూర్తి చేసిన తర్వాత ఎన్నికలు వస్తాయి తప్ప టిడిపి, జనసేన చెప్పినట్టు ముందస్తు ఎన్నికలు రావని ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీ రంగనాథరాజు అన్నారు. పొలమూరులో జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కమ్యూనిస్టు పార్టీకి పెట్టింది పేరు పొలమూరు అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమాలు ప్రారంభమైందన్నారు. గ్రామంలో జగనన్న సురక్ష ద్వారా 2800 మంది లబ్ధిపొందారన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చెరువులను ప్రక్షాళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి కాకర రాజేశ్వరరావు, ఎఎంసి ఛైర్మన్ వెలగల వెంకటరమణ, ఎంపిపి కర్రి వెంకటనారాయణ రెడ్డి (వాసురెడ్డి) పాల్గొన్నారు.










