అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే
ప్రజాశక్తి-పెద్దపంజాణి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హులందరికీ సంక్షేమ పధకాలు అందాలని భావించారని, అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాల అమలు చేయాలని అధికారులకు స్థానిక నాయకులకు ఎమ్మెల్యే వెంకటే గౌడ సూచించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రాయలపేట గ్రామంలో స్థానిక సర్పంచ్ ఆవుల అరుణ మునిరాజ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పధకాలు అందుకున్నాయా, సమస్యలు ఉంటే తెలియజేయమని కోరారు. అవినీతికి తావులేకుండా నేరుగా అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందుకున్నాయని లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని,సంక్షేమ పథకాల అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశేషంగా కషి చేస్తున్నారని అన్నారు. ఇళ్ల, ఇంటి స్థలాలు మంజూరు కొరకు పలువురు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డప్ప, జడ్పిటిసి సుష్మ కీర్తి, ఏఎంసి చైర్మన్ హేమంత్ రెడ్డి, మండల కన్వీనర్ బాగారెడ్డి, జిల్లా వైసిపి నాయకులు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ శంకరప్ప, సర్పంచుల సంఘం అధ్యక్షులు హరినాథ్, వైస్‌ఎంపీపీలు జిడి.బాబు, ఆంజమ్మ, ఎంపీటీసీ సరస్వతి గురునాథరెడ్డి, ఏఎంసి డైరెక్టర్ సురేష్, శ్రీనివాసులు, జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి సుహేబ్, నాయకులు బొమ్మరాజుపల్లి అమర్నాథ్ రెడ్డి, కామ్మినాయనిపల్లి శంకర్‌రెడ్డి, రాజారెడ్డి, మాకయ్య, మండలంలోని సర్పంచులు ఎంపీటీసీలు జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.










