Jul 19,2022 22:29

అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
ప్రతి ఇంట్లో సంతోషం, సంక్షేమం ఉండాలని ఆ దిశగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ క్యాలెండరును పూర్తి పారదర్శకతతో అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లి నుండి వర్చువల్‌ విధానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమంలో భాగంగా లబ్దిదారుల ఖాతాలకు కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నగదు జమచేయనున్నారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జెడ్పి చైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు, రాష్ట్ర విదేశీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు జ్ఞానేంద్రరెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఎం.హరి నారాయణన్‌, జెడ్పి వైస్‌చైర్మన్‌ రమ్యశ్రీ, చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్‌ అముద, డిఆర్‌డిఏ పీడీ తులసీ, జిల్లా వ్యవసాయ శాఖాధికారి మురళి కష్ణ, డిఎంఅండ్‌ హెచ్‌ఓ ఆర్‌ఆర్‌.రెడ్డి, బిసి వెల్ఫేర్‌ ఆఫీసర్‌ రబ్బానీ బాష, ఎల్‌డిఎం శేషగిరి రావు, జెడ్పి సిఈఓ ప్రభాకర్‌ రెడ్డి, ఇతర సంబంధిత శాఖల అధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు.
జిల్లాకు సంబంధించి ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమంలో భాగంగా 90రోజుల ఇంటి పట్టాల మంజూరులో భాగంగా 273 మందికి ఇంటి పట్టాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీలో భాగంగా 1,277 మంది రైతులకు రూ.56.9లక్షలు లబ్ది చేకూరగా, రూ.357.67 లక్షలతో 14,307 వివిధ రకాల పెన్షన్‌ కార్డులకు, ఈబిసి నేస్తం కింద రూ.36.15 లక్షలతో 241 మందికి ఈబిసి నేస్తం, రూ.48.7లక్షలతో 487మందికి జగనన్న చేదోడు, రూ.1.35 లక్షలతో 9మందికి వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం, రూ.30.79 లక్షలతో 610మందికి జగనన్న విద్యాదీవెన, రూ.60.06 లక్షలతో 690 మందికి జగనన్న వసతి దీవెన, 466 బియ్యం కార్డులు, 112 ఆరోగ్యశ్రీ కార్డులు మొత్తం రూ.592.16 లక్షలతో 18,472 మందికి లబ్దిచేకూరడం జరిగింది. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం ద్వై వార్షిక నగదు మంజూరు కార్యక్రమంలో భాగంగా జిల్లాకు మంజూరైన వివిధ పథకాలకు సంబంధించిన మెగా చెక్కులను అతిథుల చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేశారు. అనంతరం జెడ్‌పి చైర్మన్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కుల,మత, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలో ఏరాష్ట్రంలో లేనివిధంగా పూర్తి పారదర్శకతతో పేదరికం నుండి ప్రజలను బయటకు తీసుకుని వచ్చేందుకు సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతున్నదన్నారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ సంక్షేమ పథకాల లబ్ది పొందేందుకు అర్హులై ఉండి ఏకారణం చేతనైనా మిగిలిపోయిన వారరికి మరో అవకాశం కల్పిస్తూ సంక్షేమ పథకం లబ్ది అందించిన నెలలోపే గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న పిదప అర్హులైన వారికి ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమంలో మంజూరు చేయడం జరుగుతున్నదని జిల్లాలో 18,472 మందికి రూ. 592.16 లక్షలు నేడు లబ్ది చేకూరుతున్నదని తెలిపారు.