Jan 07,2023 20:39

అర్హత ఉన్న కుటుంబాలకు లబ్ధి: డిప్యూటీ సీఎం
ప్రజాశక్తి- వెదురుకుప్పం:
అర్హత ఉన్న ప్రతి ఒక కుటుంబానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరుతుందని డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి అన్నారు. శనివారం మండలంలోని మొండివెంగనపల్లి పంచాయతీలో సర్పంచ్‌ పోటుగారి లలిత భాస్కర్‌ ఆధ్వర్యంలో గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. మొండివెంగనపల్లి ,బండమీద ఇండ్లు, హరిజనవాడ, బలిజమొండి వెంగనపల్లి గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా ఆయన ప్రతిఒక్క కుటుంబాన్ని పలకరించి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారమార్గాన్ని చూపారు. వైయస్సార్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు అందుతున్నాయని చెప్పడంతో సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఎంపిడీఓ ఆఫీసు ఆవరణంలో సమావేశం నిర్వహించారు. పెంచిన పింఛన్లను లబ్ధిదారులైన 820మందికి రూ 2,18,71,500 చెక్కును పంపీణీ చేశారు. కార్యక్రమంలో జడ్పిటిసి సుకుమార్‌, ఎంపీపీ నాగరాణి, వైసిపి మండల అధ్యక్షులు పేట ధనంజయరెడ్డి, కామసాని పద్మానాభరెడ్డి, ఎంపిటిసి రమాసుబ్రమణ్యం, వెదురుకుప్పం సర్పంచ్‌ శిల్ప, గాండ్ల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పురుషోత్తం, మాంబేడు ఎంపిటిసి గుణశేఖర్‌ యాదవ్‌, బ్రహ్మణపల్లె మాజీసర్పంచ్‌ శ్యామల, ఎంపీడీవో సుధాకర్‌ రావు, తహశీల్దార్‌ పుల్లారెడ్డి, ఏపీఎం ఇందు, సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.