Sep 23,2023 22:01

అర్హత మేరకు జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ కార్డులు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
జిల్లాలో అర్హత మేరకు జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ కార్డులు మంజూరు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో అక్రిడిటేషన్‌ కమిటీ రెండవ సమావేశం నిర్వహించారు. అజెండా మేరకు అక్రిడిటేషన్‌ కార్డుల మంజూరుపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ జీఓ. ఎం.ఎస్‌.38 నియమ నిబంధనల మేరకు వర్కింగ్‌ జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ కార్డులు మంజూరు చేస్తున్నామన్నారు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, ప్రీలాన్స్‌, వెటరన్‌ జర్నలిస్టులకు డిసెంబర్‌ 2024 వరకు కార్డులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జూన్‌లో నిర్వహించిన మొదటి సమావేశంలో 293 మందికి అక్రిడిటేషన్‌ కార్డులు మంజూరు చేసినట్లు చెప్పారు. రెండోవిడత అక్రిడిటేషన్‌ కార్డులకు ఆన్‌లైన్‌లో అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి మంజూరు చేయడం జరిగిందన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం కషి చేస్తోందన్నారు. రెండవ సమావేశంకు ప్రింట్‌ మీడియాలో పెద్ద, మధ్యమ దినపత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా, కేబుల్‌ న్యూస్‌ ఛానెల్స్‌, చిన్న దినపత్రికలు, మాసపత్రికలు వెటరన్‌ జర్నలిస్టుల తరపున 120 దరఖాస్తులు అందినట్లు వివరించారు. నిబంధనలను, కమిటీలో చర్చించిన మేరకు రెండవ విడత అక్రిడిటేషన్‌ కార్డులు మంజూరు చేస్తామన్నారు. కన్వీనర్‌ బి.పద్మజ, కమిటీ సభ్యులు హౌసింగ్‌ పీడీ పద్మనాభం, లేబర్‌ ఆఫీసర్‌ ఓంకార్‌ రావ్‌, డీసీహెచ్‌ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, శివ ప్రసాద్‌, సురేంద్ర రెడ్డి, శ్రీకాంత్‌, వెంకటరత్నం పాల్గొన్నారు.