Sep 07,2022 23:01

అరగొండ 'అపోలో'లో
500 మందికి కీళ్లమార్పిడి చికిత్సలు విజయవంతం
డాక్టర్‌ నరోత్తమ రెడ్డి
ప్రజాశక్తి- తవణంపల్లి:
నూతన టెక్నాలజీ తక్కువ వ్యయంతో చేస్తున్న కీళ్లన మార్పిడి శాస్త్ర చికిత్సలను గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అపోలో డైరెక్టర్‌ నరోత్తమరెడ్డి, వైస్‌చైర్మన్‌ నవీన్‌ కుమార్‌రెడ్డిలు తెలిపారు. అరగొండ అపోలో హాస్పిటల్లో 500మందికి కీళ్ల మార్పిడి చికిత్సలు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా బుధవారం అరగొండ ఉన్నత పాఠశాల నుంచి అపోలో సంపూర్ణ ఆరోగ్యం కార్యాలయం వరకు మార్చనా నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రముఖ కీళ్ల శాస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్‌ మదనమోహన్‌ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అతి తక్కువ వ్యయంతో 500మందికి శాస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ విజయ కిషోర్‌ రెడ్డి, డాక్టర్‌ క్రూనల్‌ పటేల్‌, డాక్టర్‌ నవీన్‌ కుమార్‌ రెడ్డి, డాక్టర్‌ నరేష్‌ రెడ్డి, అపోలో మెడికల్‌ కాలేజ్‌ చంద్రశేఖర్‌ రెడ్డిలు పాల్గొన్నారు.