Oct 06,2023 08:51

భవానిని అభినందిస్తున్న విసి రంగజనార్ధన

   అనంతపురం : అనంతపురం జెఎన్‌టియు విశ్వవిద్యాలయం అనుబంధ పులివెందుల ఇంజినీరింగ్‌ కళాశాల సివిల్‌ ఇంజినీరింగ్‌ ఆచార్యులు ఆర్‌.భవానీ పరిశోధనలకు పేటెంట్‌ లభించింది. ఈ సందర్భంగా జెఎన్‌టియు ఉపకులపతి ఆచార్య రంగజనార్ధన, రెక్టార్‌ ఎంవిజరు కుమార్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య సి.శశిధర్‌లు ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ నూతన అంశాలపై పరిశోధనలు నిర్వహించి పేటెంట్స్‌ సాధనకు వర్సిటీలోని ప్రతి అధ్యాపకులూ కషి చేయాలని సూచించారు. పేటెంట్‌ గ్రహీత ఆర్‌.భవానీ మాట్లాడుతూ తాను 'సిస్టం అండ్‌ మెథడ్‌ ఫర్‌ జనరేటింగ్‌ హై పవర్‌ బై యు టిలైజేషన్‌ ఆఫ్‌ మినిమల్‌ ఇన్పుట్‌ పవర్‌ అండ్‌ ప్రెజరైజెడ్‌ వాటర్‌' అనే అంశంపై పేటెంట్‌ లభించిందని చెప్పారు. ఈ పేటెంట్‌ తనతో పాటు వి.రమేష్‌కు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య వి.సుమలత, ఆచార్య జివి.సుబ్బారెడ్డి, ఆచార్య పద్మ సువర్ణ పాల్గొన్నారు.