Jul 25,2022 22:45

'ఆర్‌బికె'ను ప్రారంభించిన మంత్రి రోజా
ప్రజాశక్తి- నగరి:
నిండ్ర మండలంలోని అత్తూరు సచివాలయంకు సంబంధించి రూ.21.80లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని రాష్ట్ర పర్యాటక సాంస్కతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడాశాఖా మంత్రి ఆర్కే రోజా సోమవారం ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ ఈ సచివాలయపరిధిలోని రైతులు రైతు భరోసా కేంద్రం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధి పొందాలని కోరారు. అలాగే ఆర్‌బికెలో వ్యవసాయానికి సంబంధించి ఎరువు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, మండలస్థాయి అధికారులు, కార్యకర్తలు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.