Apr 03,2022 23:03

జల్లికట్టు ప్రారంభిస్తున్నా రాష్ట్ర వైసిపి నాయకులు


ఉరుకులు వేసిన ఉత్సాహం
ప్రజాశక్తి-వెదురుకుప్పం:
ఆర్‌ కేయంపురం(ఎల్లారెడ్డికండ్రిగ)లో ఆదివారం గ్రామస్థులు జల్లికట్టు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్‌ కేయంపురంలో నడివీధి వేదికయ్యింది. చుట్టుపక్కల గ్రామాల వారు తమ ఎద్దులను తీసుకొచ్చారు. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా పక్క రాష్ట్రమైన తమిళనాడు నుంచి కూడా ఆ గ్రామానికి యువకులు జల్లికట్టుకు తరలివచ్చారు. ఎద్దులను నిలువరించేందుకు యువకులు పోటీపడ్డారు. ఎద్దుల కొమ్ములకు కట్టిన పట్టీళ్ళ చేజిక్కించుకోవడానికి యువకులు పోటీపడ్డారు. ఈ ప్రయత్నంలో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ జల్లికట్టు రాష్ట్ర వైసీపీ నాయకులు బండ గోవర్ధన్‌రెడ్డి, మాజీమంత్రి జెడ్పిటిసి మాధవరావు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.