ప్రజాశక్తి-చిత్తూరు : ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన వాటిలో అసంబద్ద పాయింట్స్ తొలిగించాలని ఏపిపిటిఎఫ్ జిల్లా విద్యా శాఖాధికారిని విజ్ఞప్తి చేసింది. చిత్తూరు జిల్లాలో ఉపాధ్యాయుల వివిధ సబ్జెక్టుల వారీగా విడుదల చేసిందని, సబ్జెక్ట్బుల వారిగా సీనియారిటీ పశీలించిన, G.0-47కు విరుద్దంగా కొంతమంది ఉపాధ్యాయులు ప్రమోషన్ పై వచ్చి, పాత స్టేషన్ పాయింట్స్ పొంది వున్నారు. కాబట్టి తమరు పాత స్టేషన్ జాబితాను క్షుణంగా పరిశీలించి ఫైనల్ సీనియారిటీ లిస్ట్ నందు సరిచేయాల్సిందిగా కోరారు. డిఈవో పరిశీలించి తగిన చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్తార్ అహ్మద్, విజయ్ కుమార్, అఫ్జల్, జగ్దిష్, మధు మరియు ఏపిటిఎఫ్ నాయకులు పాల్గొన్నారు.










