ఆప్యాయతను రిటర్న్ గిఫ్టుగా ఇద్దాం : మంత్రి ఆర్కే రోజా
ప్రజాశక్తి- నగరి: పలు సంక్షేమ పథకాలతో ఆర్ధికంగా ప్రజలను ఆదుకుంటూ, అన్ని వర్గాల వారికి అండగా ఉంటూ రాష్ట్రాన్ని అభివద్ధి పథకంలో నడిపిస్తున్న జగనన్న విద్యాదీవెన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి నగరి పట్టణానికి విచ్చేస్తున్నారని మన ఆప్యాయతను ఆయనకు రిటర్న్ గిప్ట్‌గా ఇచ్చి ఆయనకు ఘన స్వాగతం పలుద్దామని మంత్రి ఆర్కేరోజా అన్నారు. మంగళవారం నగరి మున్సిపాలిటీ, మండల నాయకులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీడీ కళ్యాణ మండపాలు, సచివాలయాలు, అర్భన్ హెల్త్‌సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు, వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, పశుపరిశోధనా కేంద్రాలు, ఆలయాల అభివద్ధి, పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభం, శ్మశానాలలో వసతుల కల్పన, పార్కులు, కార్పొరేట్ స్థాయికి పాఠశాలల నవీకరణ, ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల నవీకరణ, దారి సమస్యల పరిష్కారం, రోడ్లు, కల్వర్టుల నిర్మాణం, మొక్కలచేను కండ్రిగ వద్ద ప్రాజెక్టు, పలు ఆలయాల అభివద్ధి లాంటివి నేడు నియోజకవర్గంలో జరుగుతుందన్నారు. ప్రజలకు ఇంత మంచిచేసిన ముఖ్యమంత్రికి మన ఆప్యాయతనే రిటర్న్ గిఫ్ట్‌గా అందించి స్వాగతం పలుకుదామన్నారు. అత్యధిక సంఖ్యలో ప్రజలకు సమావేశానికి హాజరయ్యే అవకాశాన్ని కల్పించడం ప్రతిఒక నాయకుడు, కార్యకర్త బాధ్యతన్నారు. నియోజకవర్గ ప్రజల స్వాగతం ఎలా ఎంటుందో రాష్ట్రానికి చూపాలన్నారు. రాయలసీమ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్కే సెల్వమణి, మంత్రి సోదరులు రామ్‌ప్రసాద్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం, వైస్‌చైర్మన్‌లు బాలన్, వెంకటరత్నం రెడ్డి, ఎంపీపీ భార్గవి, వైఎస్ ఎంపీపీలు కన్నియప్ప, ఢల్లిీ, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ బాలకష్ణ, మండల కన్వీనర్ సుదర్శన నాయుడు, ఆర్బీకే చైర్మన్ బుజ్జిరెడ్డి, మున్సిపల్, మండల సచివాలయ కన్వీనర్లు దయానిధి, హరి, మున్సిపల్, మండల ప్రాంతాలకు చెందిన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.










