Apr 06,2023 20:36

ప్రజాశక్తి - పాలకొల్లు
ఎపి రాష్ట్ర ప్రయివేటు స్కూల్‌ మేనేజ్మెంట్స్‌ అసోసియేషన్‌ (అపుస్మా) పాలకొల్లు జోన్‌ అధ్యక్షులుగా 2023 - 24 విద్యా సంవత్సరానికి పట్టణంలోని మాంటిస్సోరీ స్కూల్‌, జూనియర్‌ కాలేజీ సెక్రటరీ కెవి.కృష్ణవర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం సన్‌షైన్‌ స్కూల్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో పాలకొల్లు జోన్‌కు సంబంధించిన అన్ని ప్రయివేటు పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు. కార్యదర్శిగా గురుకుల విద్యాలయ ఛైర్మన్‌ గొర్ల శ్రీనివాస్‌, ట్రెజరర్‌గా ఉల్లంపర్రు మాంటిస్సోరీస్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ మద్దాల వాసు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపర్చేందుకు ప్రత్యేక శిక్షణాకార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థుల ఉన్నతికి అవసరమైన పోటీ పరీక్షలకు సంబంధించి ప్రణాళికా బద్ధమైన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో అపుస్మా జిల్లా అధ్యక్షులు పాపారావు నాయుడు, పూర్వాధ్యక్షులు మద్దాల రాంప్రసాద్‌, రావూరి అప్పారావు, ఐడియల్‌ సుబ్బారావు, చల్లా ఆదినారాయణ, రాపాక రత్నరాజు, వి.సాయిబాబా, షాజహాన్‌ పాల్గొన్నారు.