అప్రమత్తంగా ఉండండి : కలెక్టర్
ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 11 నుండి మరో రెండు రోజుల పాటు జిల్లా లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ యం. హరి నారాయణన్ పేర్కొన్నారు. శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్న కారణంగా వాగులు, వంకలు, చెరువుల వద్ద అప్రమత్తంగా ఉండాలని, నీటి నిల్వ సామర్థ్యం ఎప్పటి కప్పుడు పరిశీలిస్తూ పరిసర ప్రాంతాల్లోని ప్రజల ను అప్రమత్తం చేయాలని సూచించారు. వర్షాల కారణంగా రెవెన్యూ, పోలీస్, విద్యుత్, వైద్య, అగ్ని మాపక శాఖ, ఇరిగేష న్, ఇతర సంబంధిత శాఖల వారు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తిస్తూ ఎక్కడా ఎటువంటి ప్రాణ నష్టం, ప్రమాదాలు జరగకుండా క్షేత్ర స్థాయిలో కూడా సమర్థవంతంగా విధులు నిర్వర్తించా లని సూచించారు. మం డల స్థాయిలోనూ కంట్రోల్ రూమ్ ఏర్పా టు చేయాలని ఎప్ప టికప్పుడు పరిస్థితు లను జిల్లా కేంద్రంలో గల కంట్రోల్ రూమ్ కి తెలియజేయాలన్నారు. ఈ కంట్రోల్ రూమ్ లో 24-7 పనిచేసేలా సిబ్బందిని విధులకు కేటా యించాలని సూచించారు.
అబుల్ కలాం ఆజాద్‌కు నివాళి
భారత స్వాతంత్య్ర సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యా శాఖామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని జిల్లా కలెక్టర్ యం. హరినారాయణన్ అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా సచివాలయంలో గ్రీవెన్స్ హాల్ నందు మౌలానా అబుల్ కలాం ఆజాద్, కనకదాసల జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ వారి చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్, డిఆర్‌ఓ ఎన్. రాజశేఖర్ లు, డిఆర్డిఏ పిడి తులసి, డిఈఓ విజయేంద్ర రావు, బిసి వెల్ఫేర్ ఆఫీసర్ రబ్బానీ బాష, మైనారిటీ, ఎస్ టి వెల్ఫేర్ అధికారులు చిన్నా రెడ్డి, మూర్తి, బి సి, ఎస్ సి కార్పోరేషన్ ఈ డి లు సుబ్రహ్మణ్యం, నరసింహులు, అడల్ట్ ఎడ్యుకేషన్ ఇంచార్జ్ డిడి మస్తాన్, కలెక్టరేట్ ఏఓ కుల శేఖర్, మైనారిటీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
భవన నిర్మాణాల లక్ష్యాలను చేరుకోవాలి : కలెక్టర్
చిత్తూరు అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం గ్రామాభివద్ధి కోసం అత్యంత ప్రాధాన్యతలుగా వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం చేపట్టిందని, వాటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అదేవిధంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వస్తున్న అర్జీలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసి పనులకు సంబంధించిన సాంకేతిక అనుమతుల కోసం అంచనాలతో వెంటనే పంపాలని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారయణన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ జిల్లాలోని సిపిఓ, సీఈవో, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ఎంపీడీవోలు తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన పనులను కార్యరూపంలో కి వెంటనే తీసుకురావాలని అందుకు సంబంధించిన పనులకు అంచనాలను రూపొందించి సాంకేతిక అనుమతుల కోసం సిపిఓ కార్యాలయానికి అప్లోడ్ సకాలంలో చేయాలని అన్నారు.










