Aug 17,2023 22:13

'అపోలో' లో ఘనంగా ఫస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డే
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: స్థానిక అపోలో నాలెడ్జ్‌ సిటీలోని అపోలో కాలేజ్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ అనుబంధం)లో ఘనంగా మొదటి గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా అపోలో యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ వినోద్‌ బట్‌, విశిష్ట అతిథిగా అపోలో నాలెడ్జ్‌ కార్యనిర్వహణ అధికారి నరేష్‌ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యరంగంలో ఫిజియోథెరపిస్టులకు ప్రత్యేక స్థానం ఉందని, మందులతో నయం చేయలేని ఎన్నో వైకల్యాలను ఫిజియోథెరపీతో సరిచేయొచ్చని అన్నారు. అపోలో పట్టభద్రులైన ఫిజియోథెరపిస్టులు సామాజిక దక్పథంతో మెలగాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం డాక్టర్‌ వినోద్‌ బట్‌, డాక్టర్‌ ఆల్ఫ్రెడ్‌ జోసెఫ్‌ అగస్తిన్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు పట్టా ప్రదానం చేశారు