ప్రజాశక్తి -పొదలకూరు :పట్టుమని 18 ఏళ్లు కూడా లేని ఓ కుర్రాడు వింత జ్వరంతో బాధపడుతూ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. దాతలు సకాలంలో స్పందిస్తే అతనికి నూరేళ్ల జీవితాన్ని అందించవచ్చు. మండలంలోని యాదవ వీధికు చెందిన పధ్వీ హేమఛరణ్ గత కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా పొదలకూరు, నెల్లూరులోని పలు ఆస్పత్రులలో వైద్యం చేయించారు. జ్వరం తగ్గకపోగా, చెన్నై లోని వెళ్లూరు సిఎంసి హాస్పిటల్ లో మెరుగైన వైద్యం కోసం చేర్పించారు. ఇప్పటి వరకు వైద్యం కోసం సుమారు రూ. 3 లక్షలు ఖర్చు చేశారు. ఆరోగ్యం మెరుగుపడలేదు. ఈ తరుణంలో అతని సోదరి పొదలకూరు లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది.. అన్న ఆరోగ్యం పట్ల ఆందోళన చెందిన ఆమె తన ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి స్థానిక నిమ్మకాయల మార్కెట్ వద్ద పరిచయస్తులను కలిసి తమకు సాయం చేయాలంటూ ప్రాధేయ పడుతుండడం చూపరులను కలిచి వేసింది.ఆ కుటుంబానికి సహాయం చేయాలనుకునే వారు ఫోన్ పే 9666897512 నంబర్ కు తమ సహాయాన్ని అందజేయాలని కోరారు.










