Jun 12,2023 16:15
  • పాల్గొన్న మాజీ మంత్రి రఘువీరారెడ్డి  

ప్రజాశక్తి-మడకశిర రూరల్ : శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలోని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వార్షికోత్సవ వేడుకలకు బళ్లారి నుండి ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి సిబ్బంది డాక్టర్స్, స్థానికులు, దాతలతో పాటు మాజీ మంత్రి రఘువీరారెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ సర్వేంద్రియానం నయనం ప్రధానమని కంటి చూపు మనిషికి ప్రధానమన్నారు. ఎల్వి ప్రసాద్ ఆర్గనైజేషన్ ,దాతల కృషితో నీలకంఠాపురంలో కంటి ఆసుపత్రిని స్థాపించి ఒక సంవత్సరంలో 3250 మందికి కట్టి పరీక్షలు చేయడంతో పాటు 120 మందికి ఆపరేషన్లు చేయించి కంటి చూపు ప్రసాదించడంలో చేసిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేకంగా ఈ ఆసుపత్రిలో పరీక్షలు చేస్తున్న ఉషని అభినందించారు. 2025 నాటికీ 6కోట్లతో కంటి పెద్ద ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. 3ఎకరాల భూమి కేటాయించమన్నారు.  ఈ కంటి ఆసుపత్రి కోసం కోటి రూపాయలు విరాళాలు అందించిన అన్నా వదినలకు పాదాభివందనం చేశారు.25లక్షలు విరాళం ఇచ్చిన ప్రశాంత్ నీళ్ కు ప్రతి ఒక్క దాతకు వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.