ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురు కుప్పం మండలంకు చెందిన తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ వాణిజ్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి బోడిరెడ్డి వెంకటరమణారెడ్డి పుట్టిన రోజు సందర్భంగా బుధవారం గంగాధర నెల్లూరులోని అన్న క్యాంటీన్ లో పేదలకు అన్నదానం చేశారు. అతని దానగుణాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గం సమన్వయకర్త చిట్టీబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు లోకనాథరెడ్డి, గంగాధర నెల్లూరు మండల పార్టీ అధ్యక్షులు దేవ సుందరం , నాయకులు పాల్గొన్నారు.










