Mar 16,2023 16:56

ప్రజాశక్తి-పాలకొల్లు : ఈనెల 20 న జరిగే అంగన్వాడీ వర్కర్లు అసెంబ్లీ ముట్టడిని జయప్రదం చేయాలని సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.కళ్యాణి కోరారు.పాలకొల్లు మహిళా భవన్ లో వై.రాణి అధ్యక్షతన ముఖ్యుల సమావేశం జరిగింది. కళ్యాణి మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ ల వేతనాలు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మినీ సెంటర్ లను  మెయిన్ సెంటర్లుగా మార్చి వేతనాలు పెంచాలని కోరారు. అంగన్వాడీ లకు ఫేస్ యాప్ రద్దు చేసి పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలని కళ్యాణి డిమాండ్ చేసారు. జి..ఓ నం.1 రద్దు చేయాలని కోరారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమ పోస్టర్ విడుదల చేశారు. ఇంకా పెద్దింట్లు, రాయుడు కుమారి, రాజమాని, పి.పద్మావతి, జి.ఝాన్సీ, భవాని, పాల్గొన్నారు. యలమంచిలి పాలకొల్లు సిఐటియు మండల కార్యదర్శిలు దేవ సుధాకర్, జవ్వాది శ్రీనివాస్ పాల్గొన్నారు.