Nov 03,2023 21:46

ఫొటో : మాట్లాడుతున్న దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి

అనర్హులకు ఎస్‌సి సర్టిఫికెట్ల్లు ఇవ్వడం అన్యాయం
ప్రజాశక్తి-కావలి : విజయవాడలోనితుమ్మలపల్లి కళాక్షేత్రంలో 2వ తేదీన జరిగిన బుడగజంగాల సభలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బుడగజంగాలను ఎస్‌సిల్లో చేర్చి, అసెంబ్లీలో తీర్మానం చేసి, రాష్ట్రపతికి పంపించి ఉన్నామని, త్వరలో వారికి ఎస్‌.సి. సర్టిఫికెట్లు ఇప్పిస్తానని, అలాగే శంభుని కాపులకు కూడా ఎస్‌.సి. సర్టిఫికెట్లు ఇప్పించామని చెప్పడం దారుణమైన విషయమని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జర్నలిస్ట్‌ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విధంగా దళిత కులాల్లో ఇతర కులాలను చేర్చి, ఎస్‌.సి. రిజర్వేషన్‌ను నిర్వీర్యం చేస్తున్నారన్నారు.
ఈ రిజర్వేషన్‌ మూడు కులాలను చేర్చి,అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారన్నారు. ఎస్‌టిలలో గిరిజన తెగల్లో బోయలను చేర్చి, అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపినామని, 15 రోజుల్లో అందరికీ తాత్కాలిక ప్రాతిపదికన ఎస్‌.సి., ఎస్‌.టి. సర్టిఫికెట్లు ఇప్పిస్తామనిచ ెప్పడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని తెలిపారు. సజ్జల రామకృష్ణా రెడ్డి అదే సభలో ఎస్‌.సి.లు తమకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మీరైన ఇతర కులాల వారు భారీ మెజార్టీతో గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం అప్రజాస్వామికమన్నారు. ఇప్పటికే ఎస్‌.సి., ఎస్‌.టి.లలో రిజర్వేషన్లలో దొంగ సర్టిఫికేట్ల బెడద రైల్వే ఉద్యోగుల్లో 50 శాతం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో 35 శాంత దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తూ, అసలైన దళిత, గిరిజనులకు రిజర్వేషన్లు చెందుకుండా పోతున్నాయని తెలిపారు. సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్‌మెంటు తీసుకుని ఎం.ఆర్‌.ఒ. కార్యాలయాల్లో సర్టిఫికెట్లు తీసుకుని ఉద్యోగాలు పొందుతున్నారన్నారు. ఒకసారి ఉద్యోగం పొందిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో తీసివేయకూడదని సుప్రీంకోర్టు ఆర్డర్‌ను అడ్డం పెట్టుకుని ఎస్‌.సి., ఎస్‌.టి. ఉద్యోగాలు పొందుతున్నారన్నారు. అసలైన దళిత, గిరిజనులు ఉపాధి పనులు, కూలి పనులు చేసుకుని ఆర్థికంగా చితికిపోయి ఉపాధి లేక కునారిల్లుతుంటే జగనన్న లేనిపోని కొత్త కొత్త కులాలను తీసుకుని వచ్చి ఎస్‌.సి.లో చేర్చి, కూలి పనులు చేసుకుంటూ చదువుకుని కూడా ప్రయోజనం లేకుండా పోతుందని వాపోయారు. ఎస్‌.సి., ఎస్‌.టి. ప్రభుత్వ ఉద్యోగస్తుల బిడ్డలు మాత్రమే అన్ని సౌకర్యాలు పొందుతుండం వల్ల కింది దళితుల గురించి పట్టించుకోవడం లేదని, ఏ కులాన్ని చేర్చినా, దళితులు ఉద్యమించక తప్పదని హెచ్చ రిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జరుగుమల్లి విజయరత్నం, ముక్కు మోహన్‌రావు, నారుబోయిన ఆనంద రావు పాల్గొన్నారు.