- స్టాండింగ్ కమిటీలో సభ్యుల ధ్వజం
ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : నగరం నడిబొడ్డున ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ డంపింగ్ యార్డ్ తలపిస్తోందని స్టాండింగ్ కమిటీ సభ్యులు చంద్రమోహన్ రెడ్డి ఇషాక్ ధ్వజమెత్తారు బుధవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మేయర్ మహమ్మద్ వసీo అధ్యక్షత వహించారు. సమావేశంలో కమిషనర్ భాగ్యలక్ష్మి డిప్యూటీ కమిషనర్ సావిత్రి కార్యదర్శి సంఘం శ్రీనివాసులు ఏసీపి బాలాజీ హెల్త్ ఆఫీసర్ గంగాధర్ రెడ్డి ఇన్చార్జ్ ఈ ఈ చంద్రశేఖర్ రెవెన్యూ ఆఫీసర్లు సతీష్ సుజాత తదితర సిబ్బంది పాల్గొన్నారు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో లోపలి భాగంలో ఆర్థిక తీసుకున్న షాపులు నిరుపయోగంగా మారాయి అన్నారు. సరైన సెక్యూరిటీ నిగా కెమెరాలు లేకపోవడం వలన రాత్రి మలమూత్ర విసర్జనలు అసాంఘిక శక్తులు నిలయంగా మారుతోందన్నారు దీన్ని అరికట్టటానికి చర్యలు చేపట్టాలన్నారు. అలాగే మార్కెట్ లోని వ్యాపారులు అంతా రోడ్లపై దుకాణాలు పెట్టుకోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది అన్నారు. కొత్త ఊరు మార్కెట్ షాపులను దుకాణాలు పెట్టుకునేలా చర్యలు చేపట్టకపోవడం పై నగర ప్రజలు అసహనం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని సభ్యులు వాపోయారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అజెండాలో తొమ్మిదవ అంశం పెండింగ్లో ఉంచారు మత్స్యశాఖ ప్రతిపాదనలో భాగంగా మినీ ఫిష్ రిటైల్ అవుట్ లెట్ నగరంలో ఏర్పాటు చేసే అంశంపై ముందస్తుగా సమాచారం మేయర్ దృష్టికి తీసుకు రాకపోవడంపై సభ్యులు ఇషాక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన అధికార యంత్రాంగం కనీస సమాచారం ఇవ్వకుండానే మేయర్ కు ఇవ్వకుండానే అజెండాలో చేర్చటం ఏమిటని వారు అధికారులను నిలదీశారు. అలాగే నగరంలో మున్సిపల్ షాపుల ఖాళీల వివరాలను మేయర్ దృష్టికి తీసుకు రాకుండా అజెండాలో చేర్చటం దారుణం అన్నారు. పాలకవర్గం దృష్టికి వివిధ అంశాలు తీసుకురాకుండానే అధికారులు స్వతంత్రించి వ్యవహరించటం తగదన్నారు పాలకవర్గం ఉన్న అంశాన్ని అధికారులు గుర్తించకపోవడం బాధ్యతారాహిత్యం అన్నారు. కావున అజెండాలోని షాపు రూముల ఖాళీల అంశానికి సంబంధించిన పదవ అంశాన్ని సైతం పెండింగ్లో ఉంచాలని ఆదేశించారు. తర్వాత మేయర్ మహమ్మద్ వసీ మాట్లాడుతూ నగరంలో వీధి కుక్కల బెడద అధికమైందని వాటి కట్టడికి అవసరమైన చర్యలు చేపట్టాలని కమిషనర్ను ఆదేశించారు. అలాగే ఓపెన్ జిమ్ లలో పాడైన పరికరాలను మరమ్మత్తు చేసే అంశాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు రంగు మారిన నీరు సరఫరా అవుతుండటం ప్రస్తావిస్తూ వాటి నివారణకు సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు అలాగే పైప్ లైన్ లీకేజీలు అధికమవుతున్నాయని వాటిపై ప్రత్యేక దృష్టి సాధించాలని సూచించారు సారించాలని సూచించారు. సభ్యుడు శ్రీనివాసులు మాట్లాడుతూ నడిమి వంకలో చెత్తాచెదారాలు కొండల పేరుకుపోయాయని వర్షాకాలం కావడంతో వంకకు నీళ్లు వస్తే వరద వస్తే గత ఏడాది లాగే ఐదు ఆరు రోడ్లు తదితర ప్రాంతాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని యుద్ధ ప్రాతిపదికన నడిమి వంక పరివాహక ప్రాంతాలలో వివిధ ప్రాంతాలు ముంపుకు గురి కాకుండా చూడాలన్నారు.










