బంగారు పతకాలు సాదించిన వారితో కోచ్ ప్రసాద్
తైక్వాండో పోటీల్లో రాణిస్తున్న విద్యార్ధులు
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):
శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ప్రసాద్ మాట్లాడుతూ తిరుపతి-కరకంబాడీ మార్గంలోని మంగళం కేంద్రంగా ఈ శిక్షణా సంస్థ పనిచేస్తోందన్నారు. బెంగుళూరులో ఇటీవల అజాదిక అమృత్ మహోత్సవ, ఫిట్ ఇండియా ఓపెన్ నేషనల్ తైక్వాండోలో మా అకాడమి నుండి 16 మంది పోటీల్లో పాల్గొనగా 16 మందికి గొల్డ్ పధకాలను సాదించామన్నారు. కర్నూలు జిల్లా నందికోట్కూరులో రాయలసీమ తైక్వాండో చాంపియన్ షిప్‌లో మా స్టూడెంట్స్ 14 గొల్డ్, 2 సిల్వర్ పధకాలను సాదించారన్నారు. విద్యతో పాటుగా తైక్వాండో విద్యార్ధుల భవిష్యత్‌కు ఉపకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.










