అన్ని పథకాల్లో జిల్లా ముందంజ
డిసెంబర్ 21న సామూహిక
గృహప్రవేశాలు
పేదలందరికీ ఇల్లు పురోగతిపై
నియోజకవర్గాల్లో సమీక్షలు
జెడ్పి సర్వసభ్య సమావేశంలో
మంత్రి పెద్దిరెడ్డి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
నాడు- నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలను ప్రభుత్వం మారుస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్రఎక్సైజ్ శాఖామాత్యులు కె.నారాయణస్వామి పేర్కొన్నారు. శనివారం ఉదయం ఉమ్మడి చిత్తూరు జిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశం చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ సమావేశపు మందిరమైన డాక్టర్ వైఎస్‌ఆర్ సభావేదిక నందు జడ్పీఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అధ్యక్షతన 5వ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈసర్వసభ్య సమావేశమునకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర విద్యుత్, భూగర్భ గనులు, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖామాత్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ ఎన్.రెడ్డప్ప, జిల్లా జాయింట్‌కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, రాష్ట్ర విదేశీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు జ్ఞానేంద్రరెడ్డి, చిత్తూరు, పలమనేరు, పూతలపట్టు, సత్యవేడు ఎంఎల్‌ఏలు ఆరణి శ్రీనివాసులు, వెంకటేగౌడ్, ఎంఎస్.బాబు, ఆదిమూలం, ఎంఎల్‌సిలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, భరత్, జడ్పీ వైస్‌చైర్మన్ రమ్య, ధనుంజయరెడ్డి, రాష్ట్ర పాలఏకిర కార్పొరేషన్ చైర్మన్ మురళీధర్‌లతో పాటు జెడ్పి సీఈఓ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి మురళీకష్ణ, డీఆర్డీఏ, డ్వామా పీడీలు చంద్రశేఖర్, తులసి, జిల్లా విద్యాశాఖ అధికారి విజయేంద్రరావు, సమగ్ర శిక్ష ఎపిసి వెంకటరమణ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన వివిధ సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపిపిలు, కోజెడ్‌పి కోఆప్టేడ్ సభ్యులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలను మారుస్తున్నామని తెలిపారు. పాఠశాలల విలీనప్రక్రియ వలన మిగులుగా ఉన్న అదనపు తరగతి గదులను అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు వినియోగించేలా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.
మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ... జిల్లాను అన్ని పథకాల అమలులో ముందంజలో ఉంచాలని, ఇందుకు అందరూ కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. డిసెంబర్ 21న సామూహిక గహప్రవేశాల కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధం కావాలన్నారు. అలాగే జిల్లాలో గహనిర్మాణాల పురోగతికి సంబంధించి నియోజకవర్గ స్థాయిలో శాసన సభ్యులు సమీక్షలు నిర్వహించి పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. నాడు-నేడు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నదని, ఈ కార్యక్రమ పర్యవేక్షణా భాద్యత తల్లదండ్రుల కమిటీ, ప్రధానోపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రప్రభుత్వం వైద్యరంగం లో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తూ ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని కూడా ప్రారంభించిందని, వైద్యసేవలను ప్రజలకు సత్వరమే అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కషి చేయాలని సూచించారు.
అదనపు తరగతి గదులు నిర్మించండి
ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రహ్మణ్యం
జిల్లా పరిషత్ సర్వ సభ్యసమావేశంలో విద్యాశాఖ అజెండా చర్చ సందర్భంగా ఎంఎల్‌సి విఠపుబాలసుబ్రహ్మణ్యం మాట్లా డుతూ తన సర్వీసులో విద్యకు ఇంతటి ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలను అభివద్ధి చేస్తున్న నాడు-నేడు కార్యక్రమం అద్భుతమని, గతంలో తానూ ఎంఎల్‌సిగా ఉన్న సమయంలో పాఠశాలల మరమ్మతుల నిమిత్తం కోరేవారని ప్రస్తుతం పూర్తిగా ఆ పరిస్థితి మారిందన్నారు. విద్యకు ఇంతటి ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ నాడు- నేడు కింద ఎక్కువ సంఖ్యలో అదనపు తరగతిగదులు మంజూరైన పాఠశాలల్లో ప్రదానోపాధ్యాయులకు ఈ పనుల నిర్వహణలో ఇంజినీరింగ్ సిబ్బంది సహకారాన్ని మరింత పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. దీనితో పాటు పిల్లలకు రాగి జావ అందించేందుకు చర్యలు
జెడ్పి సర్వసభ్య సమావేశం తీర్మాణాలు ఇవే...
1. జిల్లా పరిషత్ నిధులతో పలమనేరు, కుప్పం, వి.కోట, కుప్పం, చిత్తూరు, మదనపల్లె, హార్సిలీహిల్స్‌లో జెడ్‌పి అతిథిగహాల నిర్మాణం
2. ప్రకతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా 15వ ఆర్థిక సంఘం నిధులలో ఒక కోటి రూపాయలు కేటాయింపు
3. జిల్లాపరిషత్ కార్యాలయం నిర్మించి 100సంవత్సరాల పైబడినందున అవసరమైన భవనాల మరమ్మత్తులు, పునర్నిర్మాణం గావించుటకు ఆమోదం
4. చిత్తూరులో శిథిలావస్థకు చేరుకున్న జిల్లా పరిషత్ అతిథి గహాన్ని నిర్మించుటకు ఆమోదం
5. జిల్లా పరిషత్ చైర్మన్ వాహనం కండిషన్‌లో లేనందున నూతన వాహనం కొనుగోలుకు ఆమోదం.జెడ్పి










