Oct 17,2023 19:15

జగనన్న సురక్ష కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి - లింగసముద్రం :జగనన్న సురక్ష ద్వారా ప్రజలందరికి వైద్య పరీక్షలు చేస్తున్నట్లు కందుకూరు ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌రెడ్డి పేర్కొన్నారు.మంగళవారం మండలంలోనే అన్నేబోయినపల్లి సచివాలయం పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో వైద్యం అందించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. అనంతరం అన్నేబోయినపల్లి, అంగిరేకులపాడు గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేశారు. 328 మందికి వివిధ రకాములైన వ్యాధులకు నలుగురు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. మందులు ఉచితంగా అందజేశారు. తహశీల్దార్‌ టి.ప్రసాద్‌, ఎంపిడిఒ శేషుబాబు, వైద్యులు డాక్టర్‌ వెంకటేష్‌,డాక్టర్‌ అనురాధ,డాక్టర్‌ షాజుద్దీన్‌,డాక్టర్‌ పుల్లయ్య,సిహెచ్‌ఓ శ్రీనివాసులు, వైసిపి నాయకులు ఎందోటి పెద్దమాల్యాద్రి,అల్లం రాజేష్‌, మాజీ సర్పంచ్‌ చీమల శ్రీనివాసులు ఉన్నారు.