అన్నదానం
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: స్థానిక పిసిఆర్ కాలేజ్ గేట్ వద్ద గురజాల జగన్ మోహన్ ఛారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురజాల జగన్మోహన్ తండ్రి చెన్నకేశవ నాయుడు మాజీ పార్లమెంటు సభ్యులు ఆదికేశవులు నాయుడు సత్యప్రభ దంపతుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మురకంబట్టు వద్ద ఆదికేశవులు నాయుడు విగ్రహానికి నివాళర్పించారు. అనంతరం పిసిఆర్ కాలేజ్ గేట్ వద్ద 1000 మందికి అన్నదానం చేశారు. వారు మాట్లాడుతూ శ్రీనివాస ట్రస్ట్ ద్వారా ఆదికేశవులు నాయుడు కుటుంబం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చిత్తూరు ఎన్నో అభివద్ది, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో కాజూరు బాలాజి, దుద్ది రమణ, తెలుగు యువత నాయకులు వినరు చౌదరి, హేమాద్రి నాయుడు, కొండమిట్ట ఆనంద్, కాజూరు రాజేష్, అప్పోజి, మధుసూదన్ నాయుడు, తులసి, గంగన్నపల్లె గోపి, చిన్నా, టైగర్ నరసింహులు, చలపతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.










