అనంతపురం కలెక్టరేట్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందించి, అనంతపురం జిల్లాను రాష్ట్రంలో అగ్రభాగంలో నిలిపేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డా||పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. అనంతపురం నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మంగళవారం నాడు ఘనంగా నిర్వహించారు. డిఐజి ఆర్‌ఎస్.అమ్మిరెడ్డి, కలెక్టర్ గౌతమి, ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి మంత్రి జాతీయ పతాకావిష్కరణ చేసి, జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో చేపట్టి, అమలు చేస్తున్న అభివద్ధి కార్యక్రమాలపై ప్రజలకు మంత్రి తన సందేశం ద్వారా తెలియజేశారు.
ఎందరో మహనీయుల పోరాట ఫలితంగా దేశానికి స్వాతంత్య్ర సిద్ధించిందని చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంలో అనంత జిల్లా నుంచి పప్పూరు రామాచార్యులు, కైపసుబ్రమణ్యం శర్మ, గుత్తి కేశవపిళ్ళై, ఐదుకల్లు సదా శివన్, గుత్తి రామకృష్ణ, పెద్దగొంది కొండప్ప శ్రేష్టి, జీవరత్నమ్మ, ఆదిశేషయ్య, హంపన్న వంటి ఎందరో మహానుభావులు పాల్గొన్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నేతృతంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైందన్నారు. అవినీతి రహిత సుపరిపాలనే లక్ష్యంగా స్వచ్చమైన పాలన సాగుతోందని చెప్పారు. పరిపాలన సౌలభ్యం కోసం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేశామన్నారు. అనంతపురం జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంచేందుకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. నవరత్నాల ద్వారా అర్హులందరికీ సంక్షేమ పథకాల లబ్ధిని అందిస్తున్నట్లు చెప్పారు. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కరించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. సంక్షేమ ఫలాలు గడపగడపు చేరేందుకు సులభతరంగా ఇంటి మంగిటకే ప్రభుత్వ పరిపాలన తీసుకొచ్చారని తెలిపారు. సమిష్టిగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, రాజకీయపక్షాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, బ్యాంకర్లు పనిచేసి జిల్లాను అభివృద్ధి పథకంలో అగ్రగామిగా నిలుపుకుందామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివద్ధి, సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అభివద్ధి పథంలో అనంత జిల్లాను అగ్రస్థానంలో నిలబెట్టడానికి కషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ తలారి రంగయ్య, ఎపిఐఐసి ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, ప్రభుత్వ విద్యా సలహాదారులు ఆలూరి సాంబశివారెడ్డి, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, అసిస్టెంట్ కలెక్టర్ కుషాల్ జైన్, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ నదీం అహ్మద్, రాష్ట్ర రజక కార్పొరేషన్ ఛైర్మన్ మీసాల రంగన్న, నగర మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయ భాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఎడిసిసి బ్యాంక్ ఛైర్మన్ లిఖిత, డిఆర్‌ఒ గాయత్రి దేవి, సిపిఒ ప్రశాంత్ కుమార్, ఏఎస్పీ హనుమంతు, ఆర్డీవోలు మధుసూధన్, నిశాంత్ రెడ్డి, రవీంద్ర, సిడబ్ల్యూసీ ఛైర్‌పర్సన్ మేడా రామలక్ష్మి, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న శకటాలు, సాంస్కతి కార్యక్రమాలు
అనంతపురం నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం నిర్వహించిన 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఏర్పాటు చేసిన శకటాలు, సాంస్కతి కార్యక్రమాలు, స్టాల్స్ అహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముందుగా శకటాలకు సంబంధించి దిశ, ఫైర్ శాఖ, గహ నిర్మాణం, వైద్య ఆరోగ్యశాఖ, ఐసిడిఎస్, వ్యవసాయ శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, విద్యాశాఖ, తదితర శకటాలు బాగా ముస్తాబు చేసి ప్రదర్శించారు. ఇందులో విద్యా శాఖ శకటం ప్రథమ బహుమతి, వ్యవసాయ శాఖ శకటం రెండవ బహుమతి, ఐసిడిఎస్ శకటం మూడవ బహుమతిని గెల్చుకున్నాయి. తదనంతరం నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు దేశభక్తిని చాటాయి. అందులో అనంతపురం రక్షక ప్రీ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు వందేమాతరం అంటూ మూడు నిమిషాల పాటు చేసిన నత్యం అలరించింది. అనంతపురం పేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌కు చెందిన 200 మంది విద్యార్థులు జయహో అంటూ 6 నిమిషాల పాటు చేసిన నత్యం ఆకట్టుకుంది. అనంతపురం కెఎస్‌ఆర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 80 మంది విద్యార్థులు 'మా తెలుగు నేల మహా తెలుగు నేల' అంటూ ఐదు నిమిషాల పాటు చేసిన నత్యం అలరించింది. అనంతరం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, కలెక్టర్, ఎస్పీ తదితరులు ఆయా శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించారు. పోలీస్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఏపీఎంఐపీ, మత్స్య, చేనేత జౌళి శాఖ, డీఆర్డీఏ, మెప్మా, ఐసిడిఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, తదితర సంక్షేమ శాఖలు, వైద్య ఆరోగ్యశాఖ, ఎండోమెంట్, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాల వివరాలను, అభివద్ధి కార్యక్రమాలను తెలుపుతూ ఏర్పాటుచేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి.










