Sep 16,2023 22:01

ఏథర్‌ షోరూంని ప్రారంభించిన హీరోయిన్‌ కామ్న జెఠ్మలాని

         ప్రజాశక్తి-అనంతపురం   అనంతపురం నగరంలో సినీ నటి కామ్న జెఠ్మలాని సందడి చేసింది. స్థానిక కోవూరు నగర్‌ ఎక్స్‌టెన్షన్‌లోని డి.మార్ట్‌ ఎదురుగా సర్వీస్‌ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఏథర్‌ షోరూంని కామ్న జెఠ్మలాని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏథర్‌ బ్యాటరీ వాహనాన్ని ఐఐటి విద్యార్థులు రూపొందించడం గర్వకారణమన్నారు. ప్రజలు ఏథర్‌ వాహనాన్ని ఆదరించాలని కోరారు. మేనేజింగ్‌ డైరెక్టర్‌ నివేదితరెడ్డి మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిసారిగా స్వదేశీ ఐఐటి విద్యార్థుల నైపుణ్యంతో రూపొందించి పూర్తి విద్యుత్‌ వాహనం ఏథర్‌ స్కూటర్‌ అన్నారు. మొట్టమొదటిగా అల్యూమినియం బాడీ, అల్యూమినియం కేసింగ్‌ బ్యాటరీతో సురక్షితమైన వాహనంగా తయారైన ఏకైక బ్యాటరీ వాహనం ఏథర్‌ అన్నారు. ఉన్నతమైన మైలేజీ, ఉన్నతమైన పికప్‌, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం వాహనాన్ని ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. రూ.38 పైసలు ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణించవచ్చన్నారు. అంతేగాకుండా ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలో ప్రస్తుతం ఏథర్‌ స్కూటర్‌ ప్రజలకు అందుబాటులో ఉందన్నారు. సబ్సిడీ అనంతరం ప్రజలకు ఎక్స్‌ షోరూం ధర రూ.1.34 లక్షలుగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏథర్‌ షోరూం జనరల్‌ మేనేజర్‌ ఉదరుకుమార్‌, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.