పుస్తకాలను అందిస్తున్న చెట్ల వీరన్న తదితరులు
అనంతపురం కలెక్టరేట్ : విశాలాంద్ర బుక్ హౌస్ విశ్రాంత మేనేజర్ భార్య ఉమాదేవి రచించిన అనంత కరువు, ఇనపగజ్జల తల్లి పుస్తకాలను జిల్లా గ్రంథాలయానికి అందజేశారు. గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్ ఎల్‌ఎం.ఉమా మోహన్‌రెడ్డిని కలిసి విశాలాంద్ర బుకహేౌస్ విశ్రాంత మేనేజర్ చెట్ల వీరన్న అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు ఎల్‌ఎం.మోహన్‌రెడ్డి, రచయిత పి.రమేష్ నారాయణ, షేక్ రియాజుద్దీన్, నాగరాజు, ఎస్.రమేష్, కమలనాథ్, ఉప గ్రంధాలయ అధికారి వి. సుబ్బరత్నమ్మ, సీనియర్ అసిస్టెంట్ కె.శివ శంకర్, ఇంతియాజ్ అహమ్మద్, కావేరి పాల్గొన్నారు.










