Apr 21,2023 08:30

జెఎన్‌టియు పరీక్షల విభాగం

       అనంతపురం : అనంతపురం జెఎన్‌టియు పరిధిలో నిర్వహించిన వివిధ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను గురువారం విడుదల చేసినట్లు డైరెక్టర్‌ అఫ్‌ ఎవాల్యుయేషన్‌ ఇ.కేశవరెడ్డి, కంట్రోలర్‌ అఫ్‌ ఎక్సామినేషన్‌ బి.చంద్ర మోహన్‌ రెడ్డి తెలిపారు. ఎమ్మెసీ నాలుగవ సెమిస్టర్‌ (ఆర్‌-20) రెగ్యులర్‌, ఎంబీఏ ఒకటవ సెమిస్టర్‌(ఆర్‌-21) రెగ్యులర్‌, సప్లిమెంటరీ, ఎంసీఏ ఒకటవ సెమిస్టర్‌ (ఆర్‌-17, ఆర్‌-20) సప్లిమెంటరీ, ఎంసీఏ ఒకటవ సెమిస్టర్‌ (ఆర్‌-21) రెగ్యులర్‌, సప్లిమెంటరీ, ప్రీ పిహెచ్‌డి వింటర్‌ సెషన్‌ (2021 అడ్మిషన్‌ బ్యాచ్‌) మార్చి 2023 సంవత్సరంలో నిర్వహించిన పరీక్ష పలితాలు విడుదల అయ్యాయన్నారు. పరీక్షా పలితాల కోసం ష్ట్ర్‌్‌జూ://jఅ్‌బaతీవరబశ్ర్‌ీర.aష.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు.