
పూజ చేసేందుకు సిద్ధంగా ఉంచిన ట్రాక్టర్లు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: జిల్లాలో శరన్నవరాత్రి ఉత్సవాలు సందడిగా సాగాయి. చివరి రోజు మంగళవారం దసరా పండగను ఆనందోత్సాహాలతో ఘనంగా నిర్వహించుకున్నారు. చిన్నారులు నూతన వస్త్రాలు ధరించి ఉల్లాసంగా గడిపారు. రకరకాల వంటకాలు చేసి ఇంటిల్లిపాదీ ఆరగించారు. వాహనాలకు, యంత్రాలకు పూజలు చేశారు. మండపాలు, ఆలయాలను సందర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్కడి సంప్రదాయాల ప్రకారం కొమ్మలు వేయడం, ఇతరత్రా కార్యక్రమాలు చేపట్టారు.