ఆన్‌లైన్ చేసుకోవాలంటే.. 5వేలు పట్టుకురా.. పెనుమూరు తహశీల్దార్ లైవ్ వీడియో సోషియల్ మీడియాలో హల్‌ఛల్
ఆన్‌లైన్ చేసుకోవాలంటే.. 5వేలు పట్టుకురా..
పెనుమూరు తహశీల్దార్ లైవ్ వీడియో సోషియల్ మీడియాలో హల్‌ఛల్
శాఖాపరమైన చర్యలు తప్పవు జిల్లా కలెక్టర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
భూమికి సంబంధించి ఆన్‌లైన్ చేసుకోవాలా ముందే చెప్పాను కదా రూ.5వేలు అవుతుంది... తగ్గించుకోండి మేడమ్ అంటే ఎలా.. కుదరంటే కుదరదు... రూ.5 వేలు ఇస్తేనే సంతకం పెడతా... వెయ్యి, రెండు వేలు అంటూ బేరం మాడతావేంటి ఎలా ఇదేమైనా సంతలో కూరగాయాల వేపారమా... కుదరదు అడిగినంతా ఇచ్చుకోవాల్సిందే... ఈ మాటలన్నది ఏవ్వరో కాదు సాక్షాత్తు పెనుమూరు తహశీల్దార్ రమణి. తన భూమిని ఆన్‌లైన్‌లో ఎక్కుచ్చుకొనేందుకు ఓ రైతు పెనుమూరు తహశీల్దార్‌ను ఆశ్రయించాడు. దీనికి రూ.5వేలు డిమాండ్ చేశారు తహశీల్దార్ రమణి. ఇది ఒక్కరైతు వద్దే కాదు మండలంలో రెవెన్యూకు సంబంధించి ఏ ఫైల్‌పైన సంతకం పేట్టాలన్నా ఓ రేటు నిర్ణయించింది. అడినంత ఇచ్చుకోవాల్సిందే.. తహశీల్దార్ రమణి తీరుపై విసుగుపోయిన బాధితులు తహశీల్దార్ లంచం అడుతున్న వీడియోను లైవ్‌తీసి సోషియల్ మీడియాలో పెట్టారు. జిల్లావ్యాప్తంగా పెనుమూరు తహశీల్దార్ వీడియో హల్‌చల్ చేస్తోంది. సోషియల్ మీడియాలో వచ్చిన వార్తపై స్పందించిన జిల్లా కలెక్టర్ శాఖారపమైన చర్యలు తీసుకుటామని ప్రకటించారు.
పెనుమూరు తహశీల్దార్ రమణి వివాదాస్పదంగా మారుతుంది. గతంలో గంగవరంలో జాతీయ రహదారి భూములకు రికార్డులు మార్చి కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని ఇటీవల ఆమెను సస్పెండ్ చేశారు. అయితే ప్రస్తుతం పెనుమూరు తహశీల్దార్‌గా ఉన్న రమణి స్థానికంగా ఉన్న బాధితులను సైతం నగదు కోసం వేధిస్తూ వారిని మరింత మనోవేదనకు గురిచేస్తున్నారు. గతంలో ఇదే తహశీల్ధార్ కార్యాలయంలో ఒక రైతు రైతు కార్యాలయంలోని మతిచెందిన సంఘటన మరువకముందే.. మరికొందరు రైతుల పట్ల అదే కార్యాలయంలోని తహశీల్దార్ ఇలా వ్యవహరించడం వివాదాస్పదంగా మారింది.
క్వారీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
సిఐటియు జిల్లా అధ్యక్షులు వాడ గంగరాజు డిమాండ్
ప్రజాశక్తి- పుంగనూరు: క్వారీ, గ్రానైట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు వాడ గంగరాజు డిమాండ్ చేశారు. క్వారీ, గ్రానైట్లలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై మంగళవారం కార్మికుల జనరల్‌బాడీ సమావేశం పుంగునూరు మండలంలోని పాళ్యెంపల్లిలో జరిగింది. ఈ సమావేశానికి నరేష్ కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు జిల్లా అధ్యక్షులు వాడ గంగరాజు, జిల్లా నాయకులు మురళి మాట్లాడుతూ క్వారీ, గ్రానైట్ కార్మికులు చేస్తున్న పని చాలా ప్రమాదకరమైన పని అని, పనికి తగ్గట్టు వేతనాలు అందడం లేదని విమర్శించారు. జిల్లావ్యాప్తంగా వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారని వీరంతా అనారోగ్యానికి గురవుతున్నారని, దుమ్ము, దూళితో నిత్యం పనిచేస్తున్నారన్నారు. బ్లాస్టింగ్లు సమయంలో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉందని, రాళ్లు కదిలే టైంలో దొర్లుకొని చనిపోతున్న పరిస్థితి ఉందని ఇటువంటి సందర్భాల్లో మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి నష్టపరిహారం అందడం లేదన్నారు. కార్మికులు ఇంత కష్టపడుతున్న ప్రభుత్వ జీవోలు ప్రకారం కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదని, అమలు చేయించాల్సిన లేబర్ అధికారులు అటు వైపు చూడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యాలు లాభాలు అర్జిస్తున్న కార్మికుల బాగోగులు పట్టంచుకోవడం లేదని విమర్శించారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన కమిటీ ఎన్నుకున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా క్వారీ అండ్ గ్రానైట్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులుగా మురళి, గౌరవసలహాదారులుగా వాడ గంగరాజు, అధ్యక్షులు నరేష్‌కుమార్, కార్యదర్శి పి.మోహన్‌రెడ్డి, ఉఫాధ్యక్షులు మంజునాథ్, హేమంత్ కుమార్‌రెడ్డి, సహాయ కార్యదర్శి వెంకటా చలపతి, మధుసూదన్ రెడ్డి, కోశాధికారి హరి కుమార్ రెడ్డిలతో పాటు 8 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగిందన్నారు.










