నువ్వు రాజకీయ నాయకుడివా?-సేవకుడివా?
విలేకరుల సమావేశంలో క్రైస్తవ సంఘాల నేతలు
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):
బుధవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదటిసారి ప్రజల్లోకి వచ్చినప్పుడు అనిల్ నాకు రాజకీయాలంటే పడవని చెప్పి, ఇప్పుడు ఏదో ఆంధ్ర రాష్ట్రంలోని క్రిస్టియన్లను రాజకీయ పార్టీ పెట్టి ఉద్దరిస్తాననడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. దైవ సేవకుడిగా ఉంటూ రాజకీయ పార్టీ పెడతాననడం మంచిది కాదని ప్రేమతో హెచ్చరిస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుల, మతాలకతీంగా పరిపాలిస్తున్నారని, సిఎం నవ్వులపాలు అయ్యోలా చేయ్యద్దని హితవు పలికారు. ఏపి క్రిస్టయన్లు భాగానే ఉన్నారని, నిజమైన క్రిస్టియన్లకు రాజకీయపార్టీ అవసరం లేదన్నారు. కేఏ పాల్ పతనం తర్వాత బ్రదర్ అనిల్‌ను శాంతి దూతగా ప్రకటించారని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యురాలు రాజేశ్వరి, లూకా, పాస్టర్లు పాల్గొన్నారు.










