ప్రజాశక్తి వార్తకు స్పందన
అంతర్రాష్ట్ర రహదారికి మరమ్మతులు
ప్రజాశక్తి- యాదమరి
అంతర్రాష్ట్ర రహదారికి ఎట్టికేలకే ఆర్‌అండ్ బి శాఖ అధికారులు మరమ్మతులు చేపడుతున్నారు. చిత్తూరు - గుడియాత్తం జాతీయ రహదారి అద్వానంగా ఉందని శుక్రవారం ప్రజాశక్తి దినపత్రికలో వెళ్ళామా... పడ్డామే... అంతర్ రాష్ట్ర రహదారి అనే శీర్షిక ప్రజాశక్తి దినపత్రిక ప్రచురితమైంది. అధికారులు స్పందించి జోడి చింతల నుండి కనికాపురం తమిళనాడు సరిహద్దు వరకు రోడ్డు నందు ఉన్న గోతులను జెసిబి సాయంతో పూడ్చివేశారు. మిక్స్డ్ గ్రావల్‌తో రోడ్లో ఉన్న గుంతలను పూంచి తాత్కాలికంగా రోడ్డు ప్యాచ్ వర్క్లు చేపడుతున్నారు. గత సంవత్సర కాలంగా వర్షాలకు భారీ గొంతులో ఏర్పడిన రోడ్లు అధికారులు స్పందించి పూడ్చుతున్నారు. ఆర్‌అండ్‌బి అధికారులు పూర్తిస్థాయిలో రోడ్లు మరమ్మతు చేపట్టాలని వాహనదారులు ప్రజలు కోరుతున్నారు.










