క్రికెటర్ అనూషను సన్మానిస్తున్న రాజగోపాల్ దంపతులు
నార్పల : మండలంలోని బండ్లపల్లి గ్రా మానికి చెందిన అంతర్జాతీయ మహిళా క్రికెటర్ భారెడ్డి అనూ షను రాష్ట్ర నాటక అకాడమీ మాజీ ఛైర్‌పర్సన్ చామలూరు రాగే హరిత, వైసిపి ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజగోపాల్, తదితరులు శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టుకు నియోజకవర్గం నుంచి అనూష ప్రాతినిథ్యం వహించడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధరాచెర్ల సర్పంచి సాకే రామాంజినే యులు, ఎంఎస్.హనుమంతురాయుడు, నారాయణస్వామి, రాజా, ఉపేంద్ర పాల్గొన్నారు.










