మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ
అంతరిక్ష వారోత్సవాలు
ప్రజాశక్తి-సంగం:స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న భారత అంతరిక్ష వారోత్సవాల కార్యక్రమానికి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వైసిపి నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.తొలుత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి వారోత్సవాలను ఎమ్మెల్యే మేకపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించి పలు ప్రయోగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు ఇలాంటి కార్యక్రమాలను పాఠశాలల్లో ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. రాకెట్ సైన్స్ వైపు విద్యార్థులు మొగ్గుచూపేలా మీరందరూ విద్యార్థులను ప్రోత్సహిం చాలని కోరారు. ఇలాంటి ప్రాంతాల్లో అవసరమైన శాస్త్రసాంకేతికా భివద్దికి సంబంధించి శిక్షణ సంస్థలు ఏర్పాటుకు తమ పూర్తి సహకారం అందిస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక విద్య వ్యవస్థలో చేసిన సంస్కరణల కారణంగా ఆధునిక విద్య ప్రస్తుతం విద్యార్థులకు అందుబాటులోకి వచ్చిందన్నారు. ఆంగ్ల విద్య, డిజిటల్ క్లాస్ రూంలు, నైపుణ్యాభివద్ది కోసం ప్రత్యేక కోర్సులు, ఉన్నత విద్య చదివే వారికి ప్రోత్సహకాలు అందిస్తారన్నారు.
కార్యక్రమంలో జెడ్‌పిటిసి రావుల లక్ష్మి, డిప్యూటీ డిఇఒ రఘురామయ్య, హెడ్మాస్టర్ బుజ్జయ్య ,వైసీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు.










