ప్రజాశక్తి - ఆచంట
ఆచంట పంచా యతీ పరిధి బాలవారిపాలెం కసరత్తుగుంట గ్రామంలోని అంకినీడిచెరువులో రూ.11 లక్షలతో పూడిక తీత పనులను చేపట్టినట్లు సర్పంచి కోట సరోజినీ వెంకటేశ్వరరావు తెలిపారు. అమృత సరోవర్‌లో భాగంగా అంకినీడిచెరువు పనులను సర్పంచి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న కాలనీలకు తాగునీటి ఇబ్బందుల నేపథ్యంలో సమస్యను ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఆయన స్పందించి అధికారులతో మాట్లాడి చెరువును అభివృద్ధి పర్చి తాగునీటి చెరువుగా మార్చి జగనన్న కాలనీలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు పిచ్చెట్టి సత్యనారాయణ, నాయకులు అడ్డాల సూర్యవరప్రసాద్, ఫీల్డ్ అసిస్టెంట్ పద్మ పాల్గొన్నారు.










