ప్రజాశక్తి - బైరెడ్డిపల్లి : మండల పరిధిలోని జమ్ము గుండ్లపల్లిలో కొన్ని రోజులకు ముందు జరిగిన అంజప్ప సంఘటనకు కెవిపిఎస్ రాష్ట్ర నాయకులు క్రాంతి శనివారం అంజప్ప కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన మాట్లాడుతూ అగ్రకులాలవారు దాడి చేసి మరణించిన అంజప్ప కుటుంబానికి ఐదు ఎకరాల భూములు కేటాయించాలని, నష్టపరిహారంగా 10 లక్షలు, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వెంటనే కల్పించాలని, సంఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాలన్నారు. మండలంలోని దళితవాడలో జరుగుతున్న అన్యాయాన్ని జిల్లా కలెక్టర్, తహశీల్దార్‌లు గుర్తించి అంజప్ప కుటుంబానికి జరిగినట్లు ఏ ఎస్సీ, ఎస్టీకి జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ నియోజకవర్గంలోని తాటి రెడ్డి పల్లిలో ఓ మహిళ గ్రామ బహిష్కరణకు గురైనా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోలేదని, కనీసం ఓట్లేసి గెలిపించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా వారిని పరామర్శించి లేదన్నారు. ఆదివారం సాయంత్రం లోపు సిఐడి ఎస్‌పి స్పందించి మరణానికి కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపకుంటే రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ముట్టడి, ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ పరమట విభాగం నాయకులు అరుణాచలం, జిల్లా కార్యదర్శి సురేంద్ర, జిల్లా అధ్యక్షులు ఈశ్వర్, పలమనేరు డివిజన్ నాయకుడు పి సుబ్రహ్మణ్యం, రైతు సంఘం నాయకులు ఓబుల్ రాజు, వైద్య జిల్లా నాయకురాలు భువనేశ్వరి, సిపిఎం పార్టీ కార్యదర్శి గిరిధర్ పాల్గొన్నారు.










