ప్రజాశక్తి-గుంతకల్లు న్యాయమైన డిమండ్ల పరిష్కారం కోసం ఉద్యమించిన అంగన్‌వాడీలను ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి నిర్బంధించడం సిగ్గుచేటని ఐఎఫ్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సురేష్ మండిపడ్డారు. ఈమేరకు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో సోమవారం పొట్టి శ్రీరాములు కూడలిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు విజయవాడలో నిర్వహించే మహా ప్రదర్శనకు వెళ్తుంగా ఎక్కడికక్కడ రైల్వేస్టేషన్లలో నిర్బంధించడం బాధాకరమన్నారు. ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో రానున్న రోజుల్లో కూడా ఉద్యమాలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులో అంగన్‌వాడీలు చేపట్టబోయే ఆందోళనలకు ఐఎఫ్‌టియు సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సురేష్, డివిజన్ కార్యదర్శి చిన్నా, పట్టణ అధ్యక్షులు రామాంజనేయులు, జిల్లా కమిటీ సభ్యులు సత్తార్, సభ్యులు జిలాన్, తదితరులు పాల్గొన్నారు.
ఆందోళన చేస్తున్న ఐఎఫ్‌టియు నాయకులు










