Jun 26,2022 22:48

సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా అధ్యక్షులు వాడ గంగరాజు

ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
కుప్పం అంగన్వాడీలను వేధిస్తున్న ప్రాజెక్టు అధికారిపై చర్యలు తీసుకోవాలని, అప్పటి వరకు పోరాటం ఆగదని కుప్పంలోని అంగన్వాడీ వర్కర్లు తీర్మానించారు. ఆదివారం జమిందార్‌ పార్క్‌లో జరిగిన జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు జిల్లా అధ్యక్షులు వాడ గంగరాజు మాట్లాడుతూ ఓమహిళ అధికారిగా వుండి కూడా అంగన్వాడీ మహిళలను వేధించడం దారుణమన్నారు. ప్రభుత్వం నుంచి వస్తున్న బిల్లులు ఏవి కూడా వర్క్స్‌కు ఇవ్వడం లేదని, పైగా ఎవరూ సక్రమంగా పనిచేయడం లేదని తప్పుడు ప్రచారం చేస్తూ బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. ఆమె వైఖరి మారేంత వరకూ ప్రాజెక్ట్‌లో ఉన్న సమస్యలు పరిష్కారమయ్యే అంతవరకు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టు అధ్యక్షురాలు ప్రమీల, కార్యదర్శి లలితలు మాట్లాడుతూ అనేక రకాల సమస్యలతో వర్కర్లు, హెల్పర్లు మినీ వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యల పరిష్కారం కోసం 22న ఆర్టీవో ఆఫీస్‌ వద్ద ధర్నా చేసిన సందర్భంగా ఐసిడిఎస్‌ పిడి నాగశైలజ సమక్షంలో సిడిపిఓ శనివారం సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి కషి చేస్తానని తెలిపారు. మరి అంగన్వాడీ నాయకులు వచ్చిన ఈ సమావేశానికి సిడిపిఓ డుమ్మా కొట్టారని తప్పు చేయకపోతే ఎందుకు రారని ప్రశ్నించారు. వర్కర్లను రకరకాలుగా మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, దీనిని మానుకోవాలని డిమాండ్‌ చేశారు. వర్కర్లను పనీపాటా లేదని మాట్లాడడం దారుణం అన్నారు. ఓ అధికారిగా ఉంటూ ఆ పద్ధతిలో మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. అందరి సమక్షంలో పద్ధతి మార్చుకోవాలని పిడి ఆదేశాలు ఇచ్చిన ఆమె ఆదేశాలని ఖాతరు చేయని సిడిపిఓపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈసమస్య పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం చేయాలని శనివారం జరిగిన కమిటీ సమావేశం తీర్మానించిందని వెల్లడించారు. దీనికి పూర్తిబాధ్యత సిడిపిఓ వహించాల్సిందేనని తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ నాయకులు సరళ, కస్తూరి, నాలుగు మండలాల సెక్టార్‌లీడర్లు, అంగన్వాడీలు పాల్గొన్నారు.