అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
ప్రజాశక్తి- కార్వేటినగరం
అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు మమతా డిమాండ్ చేశారు. మంగళవారం అంగన్వాడీ సిబ్బంది కోర్కెల దినాన్ని పురస్కరించుకొని సిడిపిఓ పద్మ సునందకు డిమాండ్లతో కూడిన వినతిని అందించారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు మమతా మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీసవేతనం రూ.26వేలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ కింద రూ.5లక్షలతోపాటు వేతనంలో సగం పెన్షన్ రూపంలో ఇవ్వాలన్నారు. అంగన్వాడీ రిటైర్మెంట్ కాలాన్నీ 62 సంవత్సరంకు పెంచాలని, అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలలో విలీనం విధానాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేస్తూ, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కె.లత, జె.నాగమ్మ, టి.లక్ష్మీ, వి.వరలక్ష్మీ, విజరు, సుధారాణి పాల్గొన్నారు.










