ప్రజాశక్తి-గుత్తి అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన అంగన్‌వాడీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఎం జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందన్నారు. అలాగే వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ యాప్ కొత్త వర్షన్‌ను మార్పు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలు, అంగన్‌వాడీ కేంద్రాల అద్దెలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూలై 10, 11వ తేదీల్లో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి, సిఐటియు మండల కార్యదర్శి వి.నిర్మల, నాయకులు నాగరాజు, రమేష్, గుత్తి ప్రాజెక్టు నాయకురాళ్లు రేష్మా, గంగా తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్










