ప్రజాశక్తి-కళ్యాణదుర్గం రాష్ట్రంలోని అంగన్ వాడీల సమస్యలను పరిష్కరించడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు విమర్శించారు. ఈమేరకు మంగళవారం పట్టణంలోని మంత్రి ఉషాశ్రీచరణ్ నివాసంలో కలిసి సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీలు అరకొర వేతనాలతో ఎన్నో ఏళ్లుగా అనేక సమస్యలు ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్నారన్నారు. సిఎం జగన్ అంగన్‌వాడీలకు అనేక హామీ ఇచ్చారన్నారు. ముఖ్యంగా రూ.వెయ్యి వేతనం పెంపుతోపాటు గ్రాట్యూటీ కూడా ఇస్తామని స్వయానా అసెంబ్లీలోనే ప్రకటించారన్నారు. ఆ హామీ నీటికీ అమలు కావడం లేదన్నారు. ఈ విషయమై మంత్రి ఉషాశ్రీచరణ్‌ను అడగ్గా వాటిపై ఏవైనా జీఓలు ఉంటే తమకు అందజేయాలన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పిన మాటలు, జీఓలు తెలియకుంటే ఇక మంత్రికి అంగన్‌వాడీల స్థితిగతులు ఎలా తెలుస్తామని ప్రశ్నించారు. అంగన్వాడీలకు గ్రాట్యుటీ ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు కాపీలను త్వరలో మంత్రికి పంపుతామన్నారు. వెంటనే అంగన్వాడీలకు లభించే సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అంగన్‌వాడీలు పాల్గొన్నారు.
విలేకరులతో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు










