అంగన్వాడీ నూతన భవనానికి భూమిపూజ
ప్రజాశక్తి- గుడిపల్లి
మండలంలోని కనమనపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న అంగన్వాడి భవనానికి సోమవారం ఎమ్మెల్సీ భరత్ భూమిపూజ చేశారు. ఈ భవనానికి రూ.10లక్షలతో నూతన భవన నిర్మాణం కొరకు మంజూరు అయినట్లు ఆయన తెలిపారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు అన్ని వసతులతో ఈ భవన నిర్మాణం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచ్ భాస్కర్, వైసిపి నాయకులు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.










