Oct 21,2023 19:08

వివిద వేశాలతో చిన్నారులు

ప్రజాశక్తి-కందుకూరు :ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కందుకూరులోని వలేటివారిపాలెం మండలంలోని అత్తింటివారి పాలెం అంగన్‌వాడీ కేంద్రంలో దసరా సంబరాలు అట్టహాసంగా ప్రాజెక్టు సిడిపిఒ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ వేడుకలో భాగంగా వివిధ రకాల బొమ్మలతో ఆకర్షణీయంగా బొమ్మల కొలువును ప్రదర్శించారు. ప్రీస్కూల్‌ పిల్లలను నవ దుర్గలుగా అలంకరించి అంగన్వాడీ కేంద్రం అవరణంలో బతుకమ్మలు ఉంచి పిల్లలు ,వారి తల్లులు, అంగన్వాడీ కార్యకర్తలు బతుకమ్మ పాటలు పాడుతూ నత్యాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కందుకూరు ప్రాజెక్టు సిడిపిఒ కె.శర్మిష్ట, సూపర్‌వైజర్‌ సునీత, ప్రథమ్‌ సుపర్‌ ట్రెయినర్స్‌ వెంకట్రావు, త్రివేణి, సర్పంచ్‌ లక్ష్మమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు రాధ,భారతి,జ్యోతి,రమాదేవి, మనోహర, రాజ్యలక్ష్మి, హైమావతి, ధనలక్ష్మి ఉన్నారు.