Apr 18,2023 17:39

ప్రజాశక్తి - వీరవాసరం
ప్రభుత్వం సంక్షేమానికి దాతల సహకారంతోడైతే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని కొణితివాడ మెయిన్‌ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు బాజింకి కృష్ణారావు అన్నారు. ఈ స్కూల్‌ ప్రాంగణంలో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రానికి దాత మంగళవారం ప్రెషర్‌ కుక్కర్‌ అందజేశారు. గ్రామానికి చెందిన రుత్తుల వెంకటసత్యనారాయణ, సత్యజ్యోతి కుమారుడు హర్షిత్‌ పుట్టినరోజును పురస్కరించుకుని రూ.6 వేల విలువైన కుక్కర్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది సూర్యప్రభ, యశోధ, ఉపాధ్యాయులు లక్ష్మి, ఎవి.సత్యనారాయణ, వెంకటేశ్వరస్వామి పాల్గొన్నారు.