Mar 01,2023 21:09

ప్రజాశక్తి - ఆచంట
పెనుమంట్ర మండలం మార్టేరు తోకపేటలో నెం.40, 41 అంగన్వాడీ కేంద్రాలను మార్టేరు ఎంపిటిసి కర్రి అనూరాధ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించి వారికి ఆహార పదార్థాలు అందుతున్నాయా లేదా వాటి నాణ్యతను రోజు వారీ మెనూను పరిశీలించారు. అనంతరం చిన్నారులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి గర్భిణులకు, చిన్న పిల్లలకు పోష్టికాహారం అందించేందుకు అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం అందిస్తున్నారని తెలిపారు. పిల్లలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందేలా అంగన్వాడీ టీచర్లు చూడాలని తెలిపారు. గర్భిణీ స్త్రీలకు , చిన్నారులకు పోషక విలువలతో కూడిన అనంతరం పిల్లలకు పెట్టే భోజనం రుచిచూశారు.