Mar 29,2022 23:05

ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడి కార్యకర్తలు, హెల్పర్లు


ప్రజాశక్తి-కార్వేటినగరం:
ఈ సందర్భంగా సిఐటియుసి నాయకులు మాలతి మాట్లాడుతూ ఐసిడిఎస్‌కు బడ్జెట్‌ పెంచాలని, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ 5 లక్షలు, వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలన్నారు. అంగన్వాడీలకు రిటైర్మెంట్‌ వయసు 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో అంగన్వాడి లకు పెరిగిన వేతనాలు 2021 జూలై నుండి అమలు చేస్తున్నారని, మన రాష్ట్రంలో అంగన్వాడీలకు వేతనాలు పెరగ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సంఘం అధ్యక్షులు మమత, సభ్యురాలు నాగమ్మ, వళ్లేమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.