ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ ఆగస్టు 16 నుంచి 27వ వరకూ వైజాగ్‌లో నిర్వహించనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్‌ను పురస్కరించుకుని ఇండియన్ టెస్ట్ క్రికెటర్, రాయలసీమ కింగ్స్ జట్టు కెప్టెన్ హనుమ విహారి, టీం సభ్యులతో కలిసి ఆదివారం నిర్వహించిన 3కె రన్ ఆకట్టుకుంది. నగరంలోని ఎస్‌ఎస్‌బిఎన్ కళాశాల నుంచి ప్రారంభమైన రన్ ఆర్ట్స్ కళాశాల వరకూ సాగింది. ఈరన్‌లో డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్‌రెడ్డి, ఎడిసిఎ కార్యదర్శి మధు, ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సాయికృష్ణ, కోచ్ మధుసూదన్‌రెడ్డి, రాయలసీమ కింగ్స్ జట్టు హెడ్ కోచ్ శ్రీవాస్‌రెడ్డి, రంజి జట్టు మాజీ ఆటగాడు ప్రసాద్‌రెడ్డి, క్రికెట్ కోచ్ టీవీ చంద్రమోహన్‌రెడ్డి, యుగంధర్‌రెడ్డి, నరసింహారెడ్డి, జిల్లా క్రీడాకారులు పాల్గొన్నారు.
ఉప మేయర్ నివాసంలో విందు
3కే రన్‌లో హాజరైన ఇండియన్ టెస్ట్ క్రికెటర్ హనుమ విహారి, ఇండియా మహిళా క్రికెటర్ అనూషాకు నగర డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్‌రెడ్డి నివాసంలో విందే ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఇద్దరినీ కుటుంబ సభ్యులు సన్మానించి అభినందనలు తెలిపారు.
2కె రన్‌లోపాల్గొన్న ఇండియన్ టెస్ట్ క్రికెటర్ హనుమ విహారి, ఇండియా మహిళా క్రికెటర్ అనూషా, డిప్యూటీ మేయర్ కొగటం, తదితరులు










